గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 25 నవంబరు 2020 (20:52 IST)

కమలాలతో కాలేయం, గుండెకు ఆరోగ్యం

ఈ సీజన్లో లభ్యమయ్యే పండ్లలో కమలా పండు ఒకటి. ఇది ఆరోగ్యకారిగా ఉపయోగపడటమే కాకుండా, సిట్రిక్ యాసిడ్ కారణంగా కాస్త పులుపు, రుచిని కలిగివుంటుంది. దీన్నిఇష్టపడని వారంటూ ఎవరూ లేరు. పొట్ట, ఉబ్బసం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు కమలారసంలో ఉప్పు, మిరియాల పొడి కలిపి సేవిస్తే తగ్గిపోతాయి. 
 
మూత్రంలో మంట ఉన్న వారు కమలారసంలో లేత కొబ్బరి నీటిని కలిపి సేవిస్తే బాధలు తగ్గుముఖం పడుతుంది. టీబీ, టైఫాయిడ్‌ లాంటి వాటితో బాధపడే వారికి కమలారసం రోగనివారిణిగా ఉపయోగపడుతుంది. ఈ పళ్ళ రసాన్ని తాగితే శరీరంలో నిరోధకశక్తిని పెంచుతుంది. జలుబు, తుమ్ముల నుంచి దూరంగా ఉంచుతుంది. నిత్యం కమలారసం సేవించే వారు మంచి ఆరోగ్యంతో ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఈ పండును తినడం వల్ల కాలేయం, గుండె, మూత్రపిండాలను సక్రమంగా పని చేస్తుంది. అలాగే, దగ్గు, ఆయాసం, టీబీ ఉన్న వారు గ్లాస్‌ కమలారసంలో చిటికెడు ఉప్పు, చెంచా తేనె కలిపి తాగితే మంచి శక్తి కలిగి ఉత్సాహంగా ఉంటారు.