శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 12 నవంబరు 2020 (18:25 IST)

బత్తాయిలో ఏముందో తెలుసా? అందుకే తాగాలి బత్తాయి రసం... (video)

బత్తాయిల్లో పోషక పదార్థాలు మెండుగావున్నాయి. పిండి పదార్థాలు 6.4గ్రాములు, ప్రొటీన్లు 0.9 గ్రాములు, కొవ్వు 0.3 గ్రాములు, క్యాల్షియమ్ 50మిల్లీ గ్రాములు, పొటాషియమ్ 197 మిల్లీ గ్రాములు, బియాటిన్ 1 గ్రాము, ఫోలిక్ యాసిడ్ 5 మిల్లీ గ్రాములున్నట్లు వైద్య పరిశోధకులు తెలిపారు. ఇది జీర్ణమవడానికి దాదాపు ఒకటిన్నర గంట పడుతుందని వారు తెలిపారు.
 
మూత్రనాళంలో మంటగావుంటే బత్తాయి రసంలో గ్లూకోజ్‌గానీ, పంచదారగాని కలిపి తీసుకుంటే మూత్రనాళంలో మంట తగ్గి, మూత్రం సాఫీగా వస్తుంది.
 
ఒక గ్లాసు బత్తాయి రసంలో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి కలిపి సేవిస్తే అతిగావున్న దప్పిక తగ్గిస్తుంది. ఇంతే కాకుండా ఉబ్బసంతో బాధపడుతున్నవారికి ఇది మంచి మందులా పనిచేసి దగ్గును కూడా నివారిస్తుందంటున్నారు వైద్యనిపుణులు.