గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 20 మార్చి 2023 (21:45 IST)

రావిచెట్టు ఆకు కషాయాన్ని తాగితే ఏమవుతుంది?

peepal leafs
రావి చెట్టు. ఈ వృక్షాన్ని దేవతా స్వరూపంగా భావిస్తారు. ఐతే ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. రోజుకి రెండు గ్రాముల రావి గింజల పొడిని తేనెతో కలిపి రెండుసార్లు తీసుకుంటుంటే రక్తశుద్ధి జరిగి ఆరోగ్యవంతులవుతారు. విరేచనాలు అవుతుంటే రావి చెట్టు కాండం, ధనియాలు, పటికబెల్లం సమపాళ్లలో మిక్స్ చేసి 3 గ్రాముల చొప్పున తీసుకుంటే సమస్య తగ్గుతుంది.
 
రావిచెట్టు బెరడు, మర్రిచెట్టు బెరడు సమాన పరిమాణంలో తీసుకుని నీటిలో ఉడకబెట్టి ఆ నీటితో నోరు శుభ్రం చేసుకుంటుంటే పంటినొప్పి తగ్గుతుంది. కాళ్లు పగుళ్లు వున్నవారు రావిచెట్టు నుండి సేకరించిన పాలను కానీ లేదంటే ఆ చెట్టు ఆకుల సారాన్ని రాస్తుంటే సమస్య తగ్గిపోతుంది
అధికబరువు సమస్యతో బాధపడేవారు 4 రావి ఆకులు గ్లాసున్నర నీటిలో వేసి ఆ నీళ్లు గ్లాసు అయ్యేవరకూ మరిగించి ఆ కషాయాన్ని తాగుతుంటే బరువు తగ్గుతారు.
 
రావి చెట్టు బెరడు, రావి చెట్టు పండ్లు ఉబ్బసం చికిత్సకు ఎంతగానో సాయపడుతాయి. ఆకలి పెంచడానికి బాగా పండిని రావిచెట్టు పండ్లను తింటుంటే ఉపయోగం వుంటుంది.