ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (20:29 IST)

పెరుగులో బెల్లం వేసుకుని కలుపుకుని తింటే ఏమవుతుంది?

పెరుగులో బెల్లం వేసుకుని కలుపుకుని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. పెరుగు-బెల్లం కలిపినది సేవిస్తుంటే గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు. రక్తప్రసరణ మెరుగయ్యేందుకు పెరుగు-బెల్లం దోహదపడతాయి.
పెరుగులో బెల్లాన్ని కలిపి తీసుకుంటుంటే శరీరానికి క్యాల్షియం చేకూరుతుంది.
 
దంతాలు, ఎముకలు దృఢంగా వుండటానికి పెరుగులో తగినంత బెల్లం వేసుకుని తినాలి. పెరుగు-బెల్లం కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటివి దరిచేరవు. బరువు తగ్గాలనుకునేవారు పెరుగు-బెల్లం కలిపి తీసుకుంటుంటే ఫలితం వుంటుంది. రక్తహీనత సమస్య వున్నవారు పెరుగులో బెల్లం కలుపుకుని తీసుకుంటుంటే సమస్య తగ్గుతుంది.