గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 ఫిబ్రవరి 2023 (13:46 IST)

చిలీలో అడవుల్లో అగ్నిప్రమాదం.. 13మంది మృతి

Fire
చిలీ దేశంలో వేసవి తీవ్రత కారణంగా అగ్ని ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశముందని ప్రభుత్వం పౌరులను హెచ్చరించింది. 
 
ఇప్పటికే అగ్ని ప్రమాదాల వల్ల 13మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. తాజాగా చిలీ అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు పట్టణాలకు వ్యాపిస్తున్నాయి. 
 
బయోయోలోని శాంటా జువానా పట్టణ పరిసర ప్రాంతాల్లో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయని ప్రభుత్వం తెలిపింది. మొత్తం దేశంలో 151 ప్రాంతాల్లో మంటలు చెలరేగగా.. 65 చోట్ల అదుపులోకి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది.