సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 1 అక్టోబరు 2017 (11:57 IST)

ఉగ్రవాదులకు ఆహారం సరఫరాకు పాక్ నుంచి భారత్‌లోకి సొరంగం

పాకిస్థాన్ మరింతగా పెట్రేగిపోతోంది. సరిహద్దుల నుంచి అక్రమ చొరబాట్ల రూపంలో భారత్‌లోకి ఉగ్రవాదులను పంపిస్తున్న పాకిస్థాన్ ఇపుడు మరో దుశ్చర్యకు పాల్పడింది. భారత్‌లోకి ఉగ్రవాదులను పంపించేందుకు, వారికి అవస

పాకిస్థాన్ మరింతగా పెట్రేగిపోతోంది. సరిహద్దుల నుంచి అక్రమ చొరబాట్ల రూపంలో భారత్‌లోకి ఉగ్రవాదులను పంపిస్తున్న పాకిస్థాన్ ఇపుడు మరో దుశ్చర్యకు పాల్పడింది. భారత్‌లోకి ఉగ్రవాదులను పంపించేందుకు, వారికి అవసరమైన ఆహార పదార్థాలను, నగదును సరఫరా చేసేందుకు ఏకంగా ఓ సొరంగ మార్గాన్ని తవ్వారు. ఈ విషయాని భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) గుర్తించింది. 
 
జమ్మూ-కాశ్మీరులోని ఆర్నియా సెక్టర్‌లో అంతర్జాతీయ సరిహద్దుల్లో దాదాపు 14-15 అడుగుల పొడవైన సొరంగాన్ని గుర్తించినట్లు బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఆర్ఎస్ సెక్టర్‌లోని ఆర్నియా సబ్‌ సెక్టర్‌లో డమల నలా వద్ద అటవీ ప్రాంతంలో ఈ సొరంగం కనిపించిందన్నారు. దీనిలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నట్లు గుర్తించామననారు. 
 
అయితే, వీరు నిర్మాణ కార్మికులా? ఉగ్రవాదులా? అనే అంశం ఇంకా నిర్థారణ కాలేదన్నారు. వారిపై జవాన్లు కాల్పులు జరపడంతో పాకిస్థాన్‌లోకి పరారయ్యారని తెలిపారు. ఈ సొరంగంలో ఉన్న ఆయుధాలు, ఆహార పదార్థాలను బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆయుధాలు, ఆహార పదార్థాలను పట్టుకుని ఉగ్రవాదులు పాకుతూ వెళ్ళడానికి అనువుగా ఈ సొరంగాన్ని నిర్మించినట్లు తెలిపారు.