1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2015 (11:16 IST)

చరిత్రాత్మక ఆలయాన్ని ద్వంసం చేసిన ఐఎస్ఐఎస్

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరోసారి చారిత్రాత్మక ఆలయాన్ని నేల మట్టం చేశారు. రెండు వేల ఏళ్ళ నాటి చరిత్రను కాల గర్భంలో కలిపేశారు. పురాతన క్షేత్రం వద్ద కొలువై ఉన్న సిరియన్ల ప్రముఖ దైవం బాల్ ఆలయాలను ఒక్కొక్కటీగా ధ్వంసం చేస్తున్నారు. గతవారం ఓ ఆలయాన్ని బాంబు దాడులో కూల్చివేయగా.. తాజాగా మరో ప్రముఖ పురాతన ఆలయాన్ని ధ్వంసం చేసి నేలమట్టం చేశారు. ఈ ప్రాంతానికి యునస్కో హెరిటేజ్ గుర్తింపు కూడా ఉంది.
 
క్రీ.శ 32లో నిర్మించిన ఈ ఆలయానికి దాదాపు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఘటనను పరిశీలించిన స్థానికుడు అదొక మహా విస్ఫోటనంగా అభివర్ణించాడు. వారు పేల్చిన బాంబుకు వెలువడిన శబ్ధం విన్నవారి చెవులకు చిల్లులు పడాల్సిందే, వినికిడి లోపం సమస్య తలెత్తాల్సిందే అని చెప్పారు. శాటిలైట్లో కూడా ఆలయం ధ్వంసం సమయంలో ఏర్పడిన దుమ్ము దూళి పొగ భారీగా ఎగిసిపడటం కనిపించింది.