మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 24 సెప్టెంబరు 2023 (15:33 IST)

నైజీరియా ఇంధన డిపోలో భారీ పేలుడు - 34 మంది మృతి

blast in fuel depot
నైజీరియా సరిహద్దు సమీపంలోని బెనిన్‌లో ఉన్న ఓ ఇంధన డిపోలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఏకంగా 34 మంది చనిపోయారు. దక్షిణ బెనిన్ పట్టణంలోని సెమె పోడ్జిలో నిషిద్ద ఇంధన డిపోలో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాది. దీంతో ఆ ప్రాంతమంతా నట్టటి పొగ దట్టంగా వ్యాపించింది.
 
ఈ ఘటనలో డజన్ల కొద్దీ కాలిన మృతదేహాలు పేలుడు స్థలంలో కనిపించాయి. ప్రమాదంలో మరో 20 మంది వరకు గాయపడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు శిశువులు కూడా ఉన్నట్టు సమాచారం. కాగా, ఈ పేలుడు సంబంవించిన దృశ్యాలు సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానికి మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.