బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Modified: బుధవారం, 19 మే 2021 (13:27 IST)

నేపాల్‌లో భూకంపం, రిక్టర్‌ స్కేల్‌పై 5.3 తీవ్రత....

కాట్మాండు: నేపాల్‌లో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం రిక్టర్‌ స్కేల్‌పై 5.3 తీవ్రతతో నమోదైనట్లు నేపాల్‌ భూకంప అధ్యయన కేంద్రం పేర్కొంది. నేపాల్‌ రాజధాని నగరం కాట్మాండుకు 115 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రం నిక్షిప్తమైనట్లు తెలిపింది.

ఉదయం 5:42 గంటల సమయంలో లాంజంగ్ జిల్లాలోని భుల్‌భూలే వద్ద భూమి కంపించినట్లు భూకంప పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ లోక్బీజయ్ తెలిపారు. ఈ భూప్రకంపం వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. కాట్మాండు పరిసరాల్లో భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.