1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 మే 2025 (19:23 IST)

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఏకే47 రైఫిల్స్‌తో సెక్యూరిటీ!!

jyothi malhotra
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన కేసులో అరెస్టయిన హర్యానా రాష్ట్రంలోని హిసార్‌కు చెందిన లేడీ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఇస్లామాబాద్ పర్యటనలో రాచమర్యాదలు లభించాయి. ఆమెకు పాకిస్థాన్ ప్రభుత్వం ఏకే47 రైఫిల్స్‌ సెక్యూరిటీని కల్పించింది. ఆమెకు ఏకంగా ఆరుగురు గన్‌మెన్స్ భద్రతగా ఉన్నారు. ఈ విషయం తాజాగా వెల్లడైంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌తో పాటు చైనా దేశాల్లో పర్యటించారు. ముఖ్యంగా పాక్‌‍లో పర్యటించినపుడు ఆరుగురు గన్‌మెన్స్‌తో సెక్యూరిటీ పాక్ సర్కారు కల్పించింది. ఆమెకు పాక్ భద్రతా బలగాలు సెక్యూరిటీగా ఉన్న దృశ్యాలను స్పానిష్ యూట్యూబర్ ఒకరు రికార్డు చేశారు. 
 
జ్యోతి మల్హోత్రా పాక్‌లోని అనార్కలి మార్కెట్‌లో సంచరిస్తూ వీడియో కూడా తీసుకున్నారు. అలాగే, వీసా ఇంటర్వ్యూకు వెళ్లిన సమయంలో పాక్ ఏజెంట్లు ఆమెను ట్రాప్ చేశారు. ఆ తర్వాత ఆమె పాకిస్థాన్‌లో ఉండగానే పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో డీల్ కుదుర్చుకున్నట్టు అనుమానిస్తున్నారు.