శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 13 మే 2017 (11:42 IST)

డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో 56వేల టెక్కీల ఉద్యోగాలు హుష్ కాకి.. రోడ్డున పడితే?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో టెక్కీ ఇబ్బందులు పడుతున్నారు. బై అమెరికా దెన్ హైర్ అమెరికన్ నినాదంతో దూసుకెళ్లిన ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో 56,000 భారతీయ టెక్కీలు రోడ్డున పడనున

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో టెక్కీ ఇబ్బందులు పడుతున్నారు. బై అమెరికా దెన్ హైర్ అమెరికన్ నినాదంతో దూసుకెళ్లిన ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో 56,000 భారతీయ టెక్కీలు రోడ్డున పడనున్నట్లు.. మానవ వనరుల విభాగానికి చెందిన అధికారులు తెలిపారు. 
 
ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌మహీంద్ర, హెచ్‌సీఎల్‌ నంటి భారతీయ కంపెనీలతో పాటు, కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌, డీఎక్స్‌సీ టెక్నాలజీ కంపెనీ, క్యాప్‌ జెమినీ సంస్థలన్నింటిలో కలిపి దాదాపు 12,40,000 మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులున్నారు. వీరిలో 4.5 శాతం అంటే దాదాపు 56 వేల మంది ఉద్యోగులపై ట్రంప్‌ నిర్ణయం ప్రభావం చూపనుంది. ఇందులో భాగంగా 56వేల మంది ఉద్యోగాలు ఊడనున్నాయి.
 
అంతేకాకుండా కొత్త ఉద్యోగుల నియామకంలోనూ ఆచితూచి వ్యవహరించనున్నాయి. భారత్‌లో ఇంత భారీ ఎత్తున ఐటీ నిపుణులను తొలగించడం ఇదే తొలిసారి అని సమాచారం. ఈ పరిస్థితుల్లో 5 నుంచి 8 ఏళ్ల అనుభవం కలిగిన ఐటీ నిపుణులపై వేటు పడితే.. వారి జీవితాలు తారుమారు అయ్యే అవకాశం ఉన్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు కాస్ట్ కటింగ్‌కు కూడా ఐటీ పరిశ్రమ మొగ్గుచూపనున్నట్లు సమాచారం.