బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 మే 2022 (09:50 IST)

అమెరికాలో మరోమారు మోగిన తుపాకీ కాల్పులు

gunshoot
అమెరికా దేశంలోని చికాగో మరోమారు కాల్పుల మోత మోగింది. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారాతంమైన శుక్రవారం సాయంత్రం సౌత్ కిల్‌పాట్రిక్‌లో ప్రారంభమైన ఈ కాల్పులు శనివారం కూడా కొనసాగాయి. 
 
సౌత్ కిల్‌పాట్రిక్‌, బ్రైటన్ పార్క్, సౌట్ ఇండియానా, నార్త్ కెడ్జి అవెన్యూ, హోమ్‌బోల్ట్ ‌పార్క్‌లో దండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారు 69 యేళ్ల వృద్ధుడుతో పాటు అన్ని వయసుల వారు ఉన్నారు.