శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2022 (12:04 IST)

బీజాపూర్‌ జిల్లా దర్బాలో మావోల మెరుపుదాడి

maoists
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా దర్బా ప్రాంతంలో మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. పోలీసు క్యాంపును లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ధర్బా సమీపంలోని జైగుర్ క్యాంపుపై మావోయిస్టులు దాడి చేశారని బస్తర్ ఐజీ పి.సుందర్ రాజ్ వెల్లడించారు. 
 
ఈ దాడిలో నలుగురు భద్రతా సిబ్బంది గాయపడినట్టు ఆయన వెల్లడించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని రాయ్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరిని బీజాపూర్ జిల్లా దవాఖానాలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. కాగా, పోలీస్ క్యాంపును లక్ష్యంగా చేసుకుని దాడి చేసిన మావోయిస్టుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారని ఆయన తెలిపారు.