గురువారం, 13 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2022 (11:21 IST)

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం

road accident
నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బొలెరో వాహనం కల్వర్టును ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నంద్యాల ఆళ్లగడ్డ మండలం గుబగుండమ్మ మెట్టలో చోటుచేసుకుంది. మృతులు కడప జిల్లా మైదుకూరు వాసులుగా గుర్తించారు.
 
బేతంచర్ల రాణాగాపురంలోని మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకుని స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను వెంటనే నంద్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం వెనుక కారణం ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.