బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (10:31 IST)

పని చేస్తుంటే పేలిపోయిన ల్యాప్‌టాప్ - టెక్కీకి తీవ్ర గాయాలు

laptop
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. పని చేస్తున్న సమయంలో ల్యాప్‌టాప్ పేలిపోయింది. దీంతో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కడప జిల్లా బి.కోడూరు మండలం, మేకవారి పల్లెంకుచెందిన సుమలత (22) అనే టెక్కీ బెంగుళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తుంది. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం కావడంతో ఆమె ఇంటి వద్ద నుంచే పని చేస్తుంది. అయితే, సోమవారం ఉదయం 8 గంటలకు ల్యాప్‌టాప్‌‍కు చార్జింగ్ పెట్టి పనిచేస్తుండగా, అది ఒక్కసారిగా పేలిపోయింది. 
 
దీంతో మంటలు చెలరేగి ఆమె దుస్తులకు అంటున్నాయి. గదిలో నుంచి పొగలు వస్తుండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్లి చూడగా, సుమలత స్పృహతప్పి కిందపడిపోయిందివుంది. ఆ వెంటనే ఆ యువతిని జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరిలంచారు. ఆ యువతి శరీరం దాదాపు 80 శాతం మేరకు కాలిపోయింది.