గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2022 (18:11 IST)

ఛార్జింగ్ పెట్టి ఆఫీస్ వర్క్ చేసిన మహిళ... ల్యాప్ టాప్ పేలిపోయింది..

Laptop
కరోనాతో వర్క్ ఫ్రమ్ హోమ్ కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఓ మహిళ వర్క్ చేస్తుండగా ల్యాప్ టాప్ పేలింది. ల్యాప్ టాప్ పేలిన ఘటనలో ఓ మహిళా సాప్ట్ వేర్ ఇంజినీర్ తీవ్రంగా గాయపడింది. కడపలో ఈ ఘటన చోటు చేసుకుంది.
 
కడప జిల్లా బద్వేల్‌, మేకవారిపల్లెకు చెందిన 24ఏళ్ల సుమలతకు ల్యాప్ టాప్ పేలిన ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. ఛార్జింగ్ పెట్టి ల్యాప్‌టాప్‌లో ఆఫీస్‌ వర్క్‌ చేసుకుంటుండగా ఒక్కసారిగా ల్యాప్‌టాప్‌ నుంచి మంటలు చెలరేగాయి. పెద్ద బాంబులాగా అది పేలిపోయింది. ఆ ధాటికి సుమలత తీవ్రంగా గాయపడింది. దీంతో వెంటనే ఆమెను కడపలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించారు బంధువులు.
 
చార్జింగ్‌ పెట్టుకొని మరీ పని చేయడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని అంటున్నారు. అయితే నాసిరకం చార్జర్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది. చార్జింగ్‌ పెట్టి పని చేయడం ప్రమాదకరమని వార్నింగ్‌ ఇస్తోంది.