సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 3 జూన్ 2024 (12:55 IST)

93 యేళ్ల వయసులో మరో పెళ్లి చేసుకున్న వరల్డ్ మీడియా దిగ్గజం రూపర్ట్ మర్దోక్!!

rupert murdoch
కాగా, మర్డోక్‌కు ఇది ఐదో పెళ్లి. మర్దోక్ మొదట ఆస్ట్రేలియాకు చెందిన పాట్రిషియా బుకర్ను వివాహమాడారు. 1960ల్లో వీరి బంధం ముగిసిపోయింది. ఆ తర్వాత జర్నలిస్ట్ అన్నా మరియా మన్, చైనా వ్యాపారవేత్త విల్డీ డెంగ్, అమెరికా మోడల్ జెర్రీ హాల్తో విడాకులు తీసుకున్నారు. మర్డోక్ తన మాజీ భార్యల్లో ఒకరైన విల్డీ డెంగ్ ఇచ్చిన పార్టీలో జుకోవా పరిచయమయ్యారు. అప్పటి నుంచి వీరు డేటింగులో ఉన్నారు. 
 
రష్యాకు చెందిన జుకోవా అమెరికాకు వలస వచ్చారు. గతంలో ఆమెకు మాస్కో ఆయిల్ బిలియనీర్ అలెగ్జాండర్‌తో వివాహమైంది. 1950లో మీడియా కెరీర్‌ను ఆరంభించిన మర్దక్.. న్యూస్ ఆఫ్ ది వరల్డ్, ది సన్ వార్తా పత్రికలను ప్రారంభించారు. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడి న్యూయార్క్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్ వంటి పబ్లికేషన్సును కొనుగోలు చేశారు. ప్రస్తుతం తన సంస్థలకు గౌరవ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.