సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 19 మార్చి 2019 (15:15 IST)

కదిలే బస్సులో బట్టలిప్పి అందరి ముందే పని కానిచ్చేస్తున్నారు..

మనకు ప్రయాణం చేసే సమయంలో ఎదుటి వారు చేసే పనులు కొన్నిసార్లు విసుగు తెప్పిస్తాయి. ఒకింత అసహనానికి గురిచేస్తాయి. అయితే ఓ జంట తోటి ప్రయాణికులు చూస్తుండగానే దుస్తులు విప్పేసి..అందరూ చూస్తుండగానే విచక్షణ మరిచి కామ క్రీడలో మునిగి తేలారు. ఈ ఘటన ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ నుంచి ఎక్సెటర్‌కు వెళ్తున్న బస్సులో చోటుచేసుకుంది. ఈ ఘటన మార్చి 4వ తేదీన జరిగింది. 
 
రాత్రి సుమారు 10 గంటల సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 32 ఏళ్ల మహిళ, 29 ఏళ్ల వ్యక్తి కదులుతున్న బస్సులోనే దుస్తులు విప్పేసి సెక్స్ చేయడం మొదలుపెట్టారు. ప్రయాణికులు ఈ విషయాన్ని డ్రైవర్ దృష్టికి తీసుకెళ్లడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేసాడు. బస్సు ఎక్సెటర్‌కి చేరగానే పోలీసులు ఆ జంటను అదుపులోకి తీసుకున్నారు. 
 
ఇంగ్లండ్ దేశంలో బహిరంగ ప్రదేశాల్లో సెక్స్ చేసే వారి సంఖ్య క్రమేపీ పెరిగుతోంది. చాలా మంది పార్కులు, పార్కింగ్ ప్రదేశాలు, బ్యాంకులు, రెస్టారెంట్‌లలో కూడా సెక్స్ చేస్తూ దొరికిపోతున్నారు. దీని వల్ల అక్కడి పోలీసులు ప్రజలను ఇబ్బంది పెట్టే బహిరంగ సెక్స్ కార్యకలాపాల్లో తీవ్రంగా పరిగణిస్తూ కఠిన చర్యలకు పూనుకుంటున్నారు.