సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 ఆగస్టు 2020 (16:23 IST)

కరోనాకు మరో వైరస్‌ తోడైంది... ఏడుగురు మృతి.. అచ్చంగా కోవిడ్ లాగానే..?

కరోనాకు మరో వైరస్‌ తోడైంది. సివియర్ ఫీవర్ విత్ త్రామ్ బోసిటోపెనియా సిండ్రోమ్ (ఎస్ఎఫ్‌టీఎస్) అని ఈ వైరస్‌ని పిలుస్తారు. ఇది కూడా చైనాలోనే పుట్టింది. అప్పుడే ఈ వైరస్ బారిన 60మంది పడ్డారని, మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. దీని లక్షణాలు కూడా అచ్చంగా కరోనా లక్షణాల మాదిరిగానే ఉన్నాయి. 
 
విపరీతంగా దగ్గు, జ్వరం వస్తాయి. అయితే.. ఇదేం కొత్త వైరస్ కాదు.. ఇంతకు ముందే 2010లోనే చైనాలో కనిపించిందని కూల్‌గా చెప్తోంది. ఆ తర్వాత జపాన్, కొరియాల్లోనూ కేసులు వెలుగు చూశాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ వరకు తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్ లో 37 కేసులు వెలుగు చూశాయి. 
 
పదేళ్ల తరువాత మళ్లీ వెలుగు చూసిన ఈ వైరస్ నల్లి వంటి కీటకాల ద్వారా వ్యాపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది మనుషుల రక్తం, శ్లేషం ద్వారా వ్యాపించే అవకాశం ఉందని ఝెజియాంగ్ యూనివర్సిటీ ఆస్పత్రి వైద్యులు షెంగ్ జిఫాంగ్ పేర్కొన్నారు.
 
ఇది కూడా మనుషుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధి అని నిర్ధారించారు. అయితే జాగ్రత్తలు తీసుకున్నంత కాలం దీని గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు సెలవిస్తున్నారు.