1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

నాడు టీవీ యాంకర్ - నేడు సమోసా విక్రేత

నాడు టీవీ యాంకర్ - నేడు సమోసా విక్రేత  Afghan journalist selling samosas to make ends meet  Afghan Journalist, Selling Samosa, Ends, Meet, ఆప్ఘనిస్థాన్, జర్నలిస్టు, సమోసా   ఆప్ఘనిస్థాన్ దేశాన్ని తాలిబన్ తీవ్రవాదులు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆదేశ ప్రజ
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని తాలిబన్ తీవ్రవాదులు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆదేశ ప్రజల పరిస్థితులు మరింత దుర్భరంగా మారాయి. తాలిబన్ రాజ్యం రావడంతోనే అనేక మీడియా సంస్థలు మూతపడ్డాయి. దీంతో వందలాది మంది ఉద్యోగాలను కోల్పోయారు. అలాంటి వారిలో మూసా మొహ్మద్ ఒకరు. ఒకడు జర్నలిస్టుగా, టీవీ యాంకర్‌గా పని చేశారు. 
 
ముఖ్యంగా, మంచి టీవీ యాంకరుగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుదక్కించుకున్నారు. కానీ నేడు బతుకుదెరువు కోసం, కుటుంబాన్ని పోషించుకోవడం కోవడం రోడ్డు పక్కన సమోసా విక్రయిస్తున్నాడు. తద్వారా వచ్చే ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 
 
కుటుంబ పోషణ కోసం ఈ పాత్రికేయుడు మూసా మొహమ్మది వీధుల్లో సమోసాలు అమ్ముకుంటూ దర్శనమిచ్చాడు. అతడి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అతడి పరిస్థితిపై ఆఫ్ఘనిస్థాన్ జాతీయ రేడియో, టీవీ విభాగం డైరెక్టర్ అహ్మదుల్లా వాసిక్ స్పందించారు. ఆఫ్ఘనిస్థాన్‌లో నిపుణుల అవసరం ఎందో ఉందని, మూసా మొహమ్మదికి తమ సంస్థలో ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. 
 
కాగా, మొహమ్మది సమోసాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న విషయాన్ని మాజీ అధికారి కబీర్ హక్మల్ తెరపైకి తీసుకువచ్చారు. ఆయనే మొహమ్మది ఇటీవలి ఫొటోను తొలిసారి పంచుకున్నారు. కబీర్ హక్మల్ గతంలో హమీద్ కర్జాయ్ ప్రభుత్వంలో పనిచేశారు.