మోతాదుకు మించి వయాగ్రా తీసుకున్న కొత్త పెళ్లికొడుకు.. పుట్టింటికి వెళ్లిపోయిన భార్య
కొత్త పెళ్లి కొడుకు మోతాదుకు మించి వయాగ్రా మాత్రలను తీసుకుని ఆస్పత్రి పాలైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి కొన్ని నెలల క్రితం పెళ్లయింది.
తర్వాత జరిగే శోభనం కోసం కొత్తపెళ్లికొడుకు సిద్ధం అవుతుండగా, అతని స్నేహితులు ఎంటరయ్యారు. శోభనం రోజు ఫెయిల్ అవకూడదనీ అందుకోసం వయాగ్రా మాత్రలను వేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు.
దీంతో వారి సూచన మేరకు సదరు యువకుడు మోతాదుకు మించి మాత్రలను వేసుకున్నాడు. ఫలితంగా 20 రోజుల పాటు అంగస్తంభనతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు.
అతని తీరుతో విసిగిపోయిన కొత్త భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దాంతో వేరే దారిలేక బంధువులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది.