శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 జూన్ 2020 (10:22 IST)

అమెరికాలో కరోనా వైరస్ విజృంభణ.. 20 లక్షలు దాటిన కేసులు

అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. కోవిడ్‌19 వల్ల అగ్రరాజ్యంలో ఇప్పటి వరకు 112900 మంది మరణించారు. ఇక వైరస్‌ కేసుల సంఖ్య 2000464కు చేరినట్లు జాన్స్‌ హాప్కిన్స్‌ వర్సిటీ పేర్కొంది. తాజా లెక్కలతో కేసుల సంఖ్య విషయంలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా తర్వాత స్థానాల్లో బ్రెజిల్‌, రష్యా దేశాలు ఉన్నాయి. అమెరికాలో సుమారు 21 రాష్ట్రాల్లో ఇంకా వైరస్‌ సంక్రమణ జోరుగానే కొనసాగుతోంది. 
 
అమెరికాలో వైరస్‌ సంక్రమణ రేటు.. బ్రెజిల్‌తో పోలిస్తే మూడు రేట్లు ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ప్రపంచదేశాలతో పోలిస్తే, అమెరికాలోనే అత్యధిక స్థాయిలో వైరస్‌ టెస్టింగ్‌ పరీక్షలు జరుగుతున్నాయి. అలాగే లాటిన్ దేశం మెక్సికోలో వైరస్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 15357గా నమోదు అయ్యింది. గత 24 గంటల్లో ఆ దేశంలో 708 మంది ప్రాణాలు కోల్పోయారు.