శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 25 జూన్ 2023 (16:31 IST)

కిడ్నాప్ చేస్తున్నాడని అపోహ పడి క్యాబ్ డ్రైవర్‌పై మహిళ కాల్పులు

gunshoot
అమెరికాలోని టెక్సాస్‌లో ఓ ఘటన చోటుచేసుకుంది. తనను ఓ క్యాబ్ డ్రైవర్ అపోహ పడిన ఓ మహిళ... క్యాబ్ డ్రైవర్‌పై కాల్పులు జరిపింది. దీంతో డ్రైవర్ ప్రాణాపాయ స్థితిలో ఆ క్యాబ్ డ్రైవర్ కొట్టుమిట్టాడుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
టెక్సాస్‌కు చెందిన ఓ మహిళ.. ఎల్‌ పాసో కౌంటీలో ఉన్న మిత్రుడిని కలిసేందుకు ఉబర్‌ క్యాబ్‌లో ఎక్కింది. కొంతదూరం వెళ్లిన తర్వాత హైవేపై ఉన్న బోర్డులను చూసిన ఆమె.. క్యాబ్‌ వేరే మార్గంలో వెళ్తోందని ఆందోళనకు గురైంది. 
 
డ్రైవర్‌ తనను కిడ్నాప్‌ చేసి మెక్సికో వైపు తీసుకెళ్తున్నట్లు అనుమానించిన ఆమె.. వెంటనే బ్యాగులో ఉన్న తుపాకీని తీసి అతడిపై కాల్పులు జరిపింది. దీంతో డ్రైవర్‌ మెడకు, చేతికి తీవ్ర గాయాలవడంతో పాటు కారు అదుపుతప్పి ఆగిపోయింది. ఈ విషయాన్ని ఆమె పోలీసులకు చేరవేసింది. అదే సమయంలో రక్తపుమడుగులో ఉన్న డ్రైవర్‌ ఫొటోలను తన బాయ్‌ఫ్రెండ్‌కు కూడా పంపించింది.
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ఉబర్‌ డ్రైవర్‌ ప్రయాణికురాలిని కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించాడని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని.. కేవలం అనుమానంతోనే ఆమె కాల్పులు జరిపి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం ఆమెపై హత్యాయత్నం అభియోగాలు నమోదు చేశారు. 
 
దీనిపై ఉబర్‌ యాజమాన్యం కూడా స్పందించింది. ప్రయాణికురాలి తీరును తీవ్రంగా తప్పపట్టింది. ఇదో భయంకరమైన చర్యగా అభివర్ణించింది. తమ సర్వీసుల్లో ఇటువంటి హింసను సహించేది లేదని.. సదురు మహిళపై ఉబర్‌ సేవలను వినియోగించకుండా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.