సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఠాగూర్

కుమారుడిని కాపాడుకునే ప్రయత్నంలో తెలుగు ఎన్నారై దుర్మరణం... ఎక్కడ?

drowning-in-sea
అమెరికాలోని కాలిఫోర్నియా పాంథర్ బీచ్‌లో ఓ విషాదకర ఘటన జరిగింది. సముద్రపు నీటిలో మునిగిన తన కుమారుడిని కాపాడుకునే ప్రయత్నంలో తెలుగు ఎన్నారై ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సముద్రంలోకి వెళ్లిన ఎన్నారై కుమారుడు తిరిగి ఒడ్డుకు చేరుకోలేక పోయాడు. దీంతో తన కుమారుడిని రక్షించుకునేందుకు తనకు ఈత రాకపోయినా కుమారుడి కోసం నీళ్లలోకి దిగి, తన కుమారుడిని రక్షించాడు. కానీ, ఆ సమయంలో ఒక్కసారిగా పెద్ద అల రావడంతో సముద్రంలో మునిగిపోయాడు. ఆ తర్వాత అత్యవసర సిబ్బంది ఆయనను రక్షించి ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితంలేకుండా పోయింది. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
ఆ తెలుగు ఎన్నారై పేరు జొన్నలగడ్డ శ్రీనివాసమూర్తి. ఇటీవల కాలిఫోర్నియాలోని పాంథర్ స్టేట్ బీచ్‌లో ఈ దుర్ఘటన జరిగింది. గత సోమవారం సాయంత్రం శ్రీనివాసమూర్తి కుమారుడు సముద్రంలోకి వెళ్లి బయటకు రాలేక పోయాడు. ఇది గమనించిన శ్రీనివాస మూర్తి తనకు ఈత రాకపోయినా కుమారుడి రక్షించుకోవాలన్న లక్ష్యంతో సముద్రంలోకి వెళ్లి, కుమారుడిని రక్షించాడు. 
 
ఇంతలో పెద్ద అల ఒకటి రావడంతో ఆయన నీటిలో మునిగిపోయాడు. భారీ అల ఆయనను సముద్రంలోకి లాక్కెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు నిస్సహాయంగా చూస్తుండిపోయారు. ఆ తర్వాత అత్యవసర సిబ్బంది ఆయనను బయటకు తీసుకొచ్చి స్థానిక ఆస్ప్తరిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాస మూర్తి ప్రాణాలు విడిచాడు.