ఫ్లైట్ ల్యాండ్ కాగానే చెలరేగిన మంటలు.. విమానం రెక్కలపై ప్రయాణికుల ఆర్తనాదాలు..
అమెరికాలోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయం గేటు వద్ద దిగిన విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ప్రయాణికులను బయటకు పంపించారు. వీరంతా విమానం రెక్కపై నిల్చొన తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు.
అదేసమయంలో విమానం రెక్కపై నిలబడిన ప్రయాణికులను సిబ్బంది కిందకు దింపుతున్న దృశ్యాలు సామాజిక మధ్యమాల్లో బయటకు వచ్చాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. పైగా, ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు వారు తెలిపారు.
అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో కొలరాడో స్ప్రింగ్స్ ఎయిర్ పోర్టు నుంచి డాలర్ ఫోర్ట్ వర్త్‌కు అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఒకటి బయలుదేరింది. ఈ విమానంలోని ఇంజిన్‌లో వైబ్రేషన్స్ రావడాన్ని గుర్తించిన పైలెట్లు.. విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
విమానాశ్రయంలోని టాక్సీయింగ్ ప్రదేశంలో విమానం దిగిన వెంటనే ఇంజిన్‌లో మంటలు తలెత్తాయి. అందరూ చూస్తుండగానే విమానమంతా దగ్ధమైపోయింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను ఎమర్జెన్సీ ద్వారా నుంచి బయటకు తీసుకొచ్చారు. అదృష్టవశాత్తూ ఎవరిక ఎలాంటి గాయం కాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.