గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 జూన్ 2021 (08:31 IST)

మెక్సికోలో మారణహోమం ... కాల్పుల్లో 15 మంది మృత్యువాత

మెక్సికో నగరంలో దుండగులు మరోమారు రెచ్చిపోయారు. కార్లలో నగరమంతా తిరుగుతూ మారణహోమం సృష్టించారు. విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 15 మంది మృత్యువాతపడ్డారు. అమెరికా - మెక్సికో సరిహద్దు రాష్ట్రమైన రేనోసోలో ఈ ఘటన జరిగింది. 
 
కొందరు దుండగులు కార్లలో తిరుగుతూ జనంపై తూటాల వర్షం కురిపించారు. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. 
 
అతడి కారు డిక్కీలో బంధించిన ఇద్దరు మహిళలను రక్షించాయి. ఆ ఇద్దరినీ కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. మాఫియా ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఇక్కడ గల్ఫ్ కార్టెల్ ముఠాలో ఇటీవల విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వరుసదాడులు జరుగుతున్నాయి.