శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 మే 2021 (09:23 IST)

మధ్యదరా సముద్రంలో పెను విషాదం.. పడవ మునిగి 57 జలసమాధి

ట్యునీషియా దేశంలో మధ్యదరా సముద్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఈ సముద్రంలో పడవ మునిగిపోవడంతో 57 మంది మృత్యువాతపడ్డారు. అలాగే, 33 మందిని ట్యునీషియాకు చెందిన రెడ్‌ క్రెసెంట్ సంస్థ రక్షించింది. 
 
లిబియా నుంచి ఇటలీకి వెళ్తున్న వలసదారుల పడవ ఒకటి ట్యునీషియా తీరంలో ప్రమాదానికిగురై సముద్రంలో మునిగిపోయింది. ఇటీవల ట్యునిషియా తీరంలో పడవలు ముగిన సంఘటనలు వరుసగా జరుగుతున్న విషయం తెల్సిందే. 
 
ప్రస్తుతం వాతావరణం కాస్త మెరుగుపడినందున ట్యునీషియా, లిబియా నుంచి యూరప్‌ వైపు వలసలు పెరిగాయి. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 90 మంది ఉన్నారని.. 33 మంది ప్రాణాలతో బయటపడగా.. వీరంతా బంగ్లాదేశీయులని రెడ్‌ క్రెసెంట్‌ అధికారి మొంగి స్లిమ్‌ పేర్కొన్నారు.
 
కాగా, ట్యునీషియా తీరంలో పడవలు ముగిన ఘటనల్లో ఇటీవల సుమారు 60 మందిపైగా వలసదారులు మరణించారు. ఈ ఏడాది 23వేలకుపైగా వలసదారులు ఐరోపాకు సముద్రం మీదుగా వలస వచ్చారని.. చాలా మంది కొత్తగా ఇటలీ, స్పెయిన్‌కు ట్యునీషియా, అల్జీరియా నుంచి వచ్చారని యూఎన్‌హెచ్‌సీఆర్‌ పేర్కొంది. ఈ ఏడాదిలో జరిగిన ప్రమాదాల్లో సుమారు 633 మంది మృతి చెందారని లేదా గల్లంతైనట్టు ఏజెన్సీ అంచనా వేసింది.