Senator: ఈ మగాళ్లు మారరా? మందేసి టేబుల్ మీద చిందేయన్నారు.. ముస్లిం సెనేటర్
ఆధునికత పెరిగినా, అన్నీ రంగాల్లో మహిళలు రాణించినా.. మహిళలను ట్రీట్ చేసే విధానంలో మగాళ్ల బుద్ధి ఏమాత్రం మారట్లేదు. దేశంలో ఏ ఉన్నత పదవుల్లో వున్నవారికీ మగాళ్ల చేత వేధింపులు తప్పట్లేదు. ఆస్ట్రేలియా శాసనసభలో హిజాబ్ ధరించిన తొలి మహిళా ముస్లిం సెనేటర్ ఫాతిమా పేమాన్.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. ఒక అధికారిక కార్యక్రమానికి హాజరైన తనను ఒక పెద్ద స్థాయి సహోద్యోగి మద్యం తాగమని టేబుల్ మీద డ్యాన్స్ చేయమని బలవంతం చేశాడని పేమాన్ ఆరోపించింది. వేధింపులపై తాను పార్లమెంటరీ వాచ్‌డాగ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.
ఇదిలా ఉంటే గతంలో 2021లో ఆస్ట్రేలియా పార్లమెంట్లో పొలిటికల్ స్టాఫర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూన్న బ్రిటనీ హిగ్గిన్స్ సాక్షాత్తూ పార్లమెంటరీ కార్యాలయంలోనే రేప్‌కు గురైంది. తనపై సహోద్యోగి ఆఫీస్‌లో తనను అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది.