బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 డిశెంబరు 2020 (19:49 IST)

పిండం.. పసిపాపగా ప్రాణం పోసుకుంది.. అమెరికాలో అరుదైన ఘటన..!

ఒక సంవత్సరం కాదు.. 27 ఏళ్ల పాటు శీతలీకరణ స్థితిలో వున్న పిండం.. పసిపాపగా ప్రాణం పోసుకుంది. ఈ అరుదైన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. టెనెస్సీకి చెందిన టీనా, గిబ్సన్ దంపతులు 27ఏళ్లుగా శీతలీకరణ స్థితిలో ఉన్న పిండంకు జీవం పోశారు. 1992లో శీతలీకరణ స్థితిలో భద్రపరిచిన పిండాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో టీనా, గిబ్సన్ దంపతులు దాత నుంచి దత్తత తీసుకున్నారు. 
 
అనంతరం వైద్యులు ఆ పిండాన్ని టీనా గర్భంలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఆమె గత నెలలో పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆ దంపతులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాగా.. ఈ విషయంపై స్పందించిన నేషనల్ ఎంబ్రియో డొనేషన్ సెంటర్ దీన్ని ఒక రికార్డుగా అభివర్ణించింది. 
 
27ఏళ్లపాటు శీతలీకరణ స్థితిలో ఉన్న పిండం ప్రాణం పోసుకున్న దాఖలాలు ఇప్పటి వరకు లేవని తెలిపింది. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పిండంకు ప్రాణం పోసిన అమెరికా దంపతులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.