ఆర్థిక ఇబ్బంది.. ఆ తల్లి కన్నబిడ్డను రూ.75 వేలకు అమ్మేసింది..
ఆర్థిక ఇబ్బంది.. ఆ తల్లిని కన్నబిడ్డను అమ్ముకునేలా చేసింది. వారం రోజుల వయస్సుగల పాపను డెబ్భై ఐదు వేల రూపాయలకు తల్లి అమ్మేసింది. భర్త నుండి విడిపోయి రాజు అనే వ్యక్తితో చంద్రయ్య నగర్‌కు చెందిన లక్ష్మీగాయత్రి సహజీవనం చేస్తుంది. గర్భవతి కావడంతో జిజిహెచ్‌లో ఆమె లక్ష్మీగాయత్రి జన్మనిచ్చింది. వారం రోజుల వయస్సు ఉన్న పాపను డెబ్భై ఐదు వేల రూపాయలకు అమ్మేసింది.
సత్యవతి అనే బ్రోకర్ ద్వారా పాపను లక్ష్మీగాయత్రి అమ్ముకుంది. వాలంటీర్ ద్వారా విషయం తెలుసుకుని పోలీసులకు చైల్డ్ లైన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. చైల్డ్ లైన్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పాప ఆచూకీ కనుగొన్న అరండల్ పేట పోలీసులు.. పాపను ట్రేస్ చేసి చైల్డ్ లైన్ ప్రతినిధులకు అప్పగించారు.