శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2024 (12:18 IST)

సమ్మె ఎఫెక్ట్ : 17 వేల ఉద్యోగులను తొలగించనున్న బోయింగ్ కంపెనీ

boeing
ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. సమ్మెకు దిగిన 17 వేల మంది ఉద్యోగులను తొలగించనుంది. కార్మికుల సమ్మె కారణంగా వాటిల్లిన నష్టం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఏకంగా 17 వేల మంది సిబ్బందిపై వేటు పేయనుంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా తన సంస్థలో పని చేస్తున్న సిబ్బందిలో దాదాపు పది శాతం మందిని తొలగించనుంది. సియాటెల్ ప్రాంతంలో 33 వేల మంది కార్మికులు నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో 737 మ్యాక్స్, 767, 777 జెట్‌ల ఉత్పత్తిన నిలిచిపోయింది. సమ్మె కారణఁగా మూడో త్రైమాసికంలో 5 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని సంస్థ తెలిపింది. 
 
ఈ నష్టాలను పూడ్చుకునేందుకు ఉద్యోగుల తొలగింపు అవసరమని సీఈవో కెల్లీ ఓర్ట్‌బర్గ్ అన్నారు. "రానున్న నెలల్లో మొత్తం ఉద్యోగుల్లో సుమారు 10 శాతం మందిని తొలగించాలని చూస్తున్నాం. వీరిలో ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లు ఉండనున్నారు" తెలిపారు. ప్రస్తుతం బోయింగ్ ఉన్న పరిస్థితుల్లో ఈ నిర్ణయాత్మక చర్యలు అవసరం అని బోయింగ్ తెలిపింది. దీర్ఘకాలికంగా నిలదొక్కుకోవడానికి ఇటువంటి కఠిన నిర్ణయాలు అవసరం అని పేర్కొంది. సమ్మె ఫలితంగా ఉత్పత్తి నిలిచిపోవడంతో 777ఎక్స్ జెట్ డెలివరీలు ఆలస్యం కానున్నట్టు తెలిపారు. 2027లో 767 ఫ్రైటర్ ఉత్పత్తిని నిలిపివేయాలని బోయింగ్ యోచిస్తుంది. ఈ నేపథ్యంలో బోయింగ్ షేర్లు 1.1 శాతం క్షీణించాయి.