బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 డిశెంబరు 2021 (11:57 IST)

పాగా వేస్తున్న ఒమిక్రాన్ వైరస్ - కీలక నిర్ణయం తీసుకున్న బ్రిటన్

సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వైరస్ ఇపుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఈ వైరస్ దెబ్బకు అనేక దేశాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. పలు దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా నిషేధం విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ సర్కారు ఇపుడు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో 30 యేళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించింది. 
 
ఈ క్రమంలో బూస్టర్ డోస్‌కు సంబంధించిన బుకింగ్స్ సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే40 యేళ్లు పైబడిన వారికి బూస్టచర్ డోసులను అక్కడి ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెల్సిందే. ఇపుడు 30 యేళ్లు పైబడిన వారికి కూడా ఈ డోస్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ డోస్‌లను వేయించుకునేందుకు ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని కోరుతున్నారు.