గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2024 (11:19 IST)

ఇటలీలో ఘోర ప్రమాదం - ప్రముఖ బ్రిటన్ వ్యాపారవేత్త మైక్ చింగ్ గల్లంతు

ship
ఇటలీ దేశంలో ఘోర ప్రమాదం సంభవించింది. సిసిలీ తీర ప్రాంతంలో తీవ్ర తుఫాను సంభవించింది. దీంతో ఓ లగ్జరీ నౌక మునిగిపోయింది. ఈ ప్రమాద సమయంలో అందులో ప్రయాణిస్తున్న బ్రిటన్ దిగ్గజ వ్యాపారవేత్త మైక్ లించ్ సహా ఏడుగురు గల్లంతు అయ్యారు. సిసిలియన్ పోర్టు నుండి ఈయాట్‌‍కు ఈ నెల 14న బయలుదేరిన నౌకలో పది మంది సిబ్బంది, 12 మంది ప్రయాణికులు ఉన్నారు. 
 
పోర్టిసెల్లో తీరానికి చేరుకున్న సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా షిప్ మునిగిపోయినట్లు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగి, నౌకను బయటకు తీసే ప్రయత్నాలు చేశాయి. ఈ ప్రమాదంలో బ్రిటన్ వ్యాపార దిగ్గజం మైక్ లించ్ గల్లంతు కాగా, ఆయన భార్యతో పాటు మరో 14 మంది ప్రమాదం నుండి బయటపడ్డారు.
 
ఈ ప్రమాదంలో గల్లంతైన వారిలో నలుగురు బ్రిటిషర్లు, ఇద్దరు అమెరికన్లు, ఒక కెనడియన్ ఉన్నట్లు ఇటలీ అధికారులు తెలిపారు. వీరిలో ఒకరి మృతదేహాన్ని బయటకు తీశారు.
 
కాగా, గల్లంతైన వ్యాపారవేత్త మైక్ లించ్ (59) అమెరికాలో మోసం కేసులో ఇటీవలే నిర్దోషిగా బయటపడ్డారు. ఆయన 1990లో టెక్ దిగ్గజ సంస్థ ఆటానమీ కార్పోరేషన్‌ను ప్రారంభించారు.