శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (13:09 IST)

వందల మందిపై అత్యాచారం.. 500 మంది తలలు తెగ నరికిన మానవ క్రూరమృగం

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 200 మందిపై అత్యాచారం జరిపాడో ఆ మానవ క్రూరమృగం. అంతేకాదండోయ్... మరో 500 మంది అత్యంత కర్కశంగా హత్య చేశాడు. ఆ మానవ మృగం పేరు అమర్ హుస్సేన్. ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన కరుడ

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 200 మందిపై అత్యాచారం జరిపాడో ఆ మానవ క్రూరమృగం. అంతేకాదండోయ్... మరో 500 మంది అత్యంత కర్కశంగా హత్య చేశాడు. ఆ మానవ మృగం పేరు అమర్ హుస్సేన్. ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాది. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదిగా ఉన్న ఇతడు దాదాపు 200 మంది అమాయక మహిళలపై అత్యాచారాలు చేశాడు... 500 మందిని అతి దారుణంగా హత్యచేశాడు. ఇన్ని దురాగాతాలు చేసిన హుస్సేన్‌ కుర్దు దళాలకు చిక్కిపోవడంతో అతను చేసిన దారుణాలు వెలుగులోకి వచ్చాయి.
 
గత 2004లో ఇరాక్‌లోని సింజార్‌ అనే నగరాన్ని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రాంతంలోని మైనార్టీ తెగకు చెందిన యాజీదీలపై ఇస్లామిక్‌స్టేట్‌ ఉగ్రవాదులు సాగించిన దమనకాండ ప్రపంచానికి తెలిసిందే. 2014లో పురుషులను కర్కశంగా చంపివేశారు. మహిళలను, యువతలను, చిన్న పిల్లలను సంతలో వస్తువులను అమ్మినట్టు విక్రయించి సెక్స్‌ బానిసలుగా మార్చేశారు. 
 
యాజీదీలతో పాటు ఇతర మైనార్టీ తెగలపై వీరి దౌర్జన్యాలు సాగాయి. గాలింపుల పేరుతో ఇంటిలోకి చొరబడి మహిళలపై అత్యాచారాలకు పాల్పడినట్టు విచారణలో హుస్సేన్‌ వెల్లడించాడు. దాదాపు 200 మందిపై అత్యాచారాలు జరిపినట్టు అంగీకరించాడు. అంతేకాకుండా తమ నేతల ఆదేశాలతో దాదాపు 500 మందికి మరణశిక్షను అమలు చేసినట్టు వెల్లడించాడు. తమ ఆధీనంలో ఉన్నవారి తల నరికివేయడం, పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో కాల్చివేయడం ద్వారా చంపడం ద్వారా తాను ఈ శిక్షలను అమలు చేసినట్టు అంగీకరించాడు. అతను వెల్లడించే నిజాల విని ప్రపంచం నివ్వెర పోతోంది.