Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మహమ్మారితో మానవులకే కాదు.. జీవజాతులన్నింటికీ ముప్పే..!

Written By సెల్వి
Updated: సోమవారం, 24 ఆగస్టు 2020 (11:22 IST)
కరోనా మహమ్మారితో ముప్పు మానవులకే పరిమితం కాదని అనేక జీవజాతులకు కరోనా ముప్పు పొంచి వుందని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తీవ్రస్థాయిలో అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న అనేక వానర జాతులకూ ఈ మహమ్మారితో ప్రమాదం ఉందని తేల్చారు. ఈ మేరకు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడి అయ్యింది.
 
మానవుల నుంచి వీటికి వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. ఈ మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. అటు మానవులతోపాటు ఇటు జంతువుల ఆరోగ్యంపైనా దృష్టిసారించాల్సిన ఆవశ్యకతను తమ పరిశోధన వెలుగులోకి తెచ్చిందన్నారు.
 
మానవుల కణాల్లోకి ప్రవేశించడానికి కరోనా వైరస్‌.. ఏసీఈ2 గ్రాహక ప్రొటీన్‌ను ఉపయోగించుకుంటుంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు వివిధ జీవ జాతుల్లో ఈ ప్రొటీన్‌ నిర్మాణ తీరును పరిశీలించడానికి జన్యు విశ్లేషణను చేపట్టారు. ముక్కు, నోరు, ఊపిరితిత్తుల్లోని పైపూత సహా అనేక కణాలు, కణజాలాల్లో ఈ ప్రొటీన్‌ ఉంటుంది. ఏసీఈ2లో అనేకరకాల అమినో ఆమ్లాలు ఉంటాయి.
 
వీటిలో 25 ఆమ్లాలు కరోనా కారక వైరస్‌ మానవ కణాల్లో ప్రవేశించడానికి వీలు కల్పిస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎన్ని జాతుల్లో ఈ రకాలు ఉన్నాయన్నది దృష్టి సారించారు. ఈ మహమ్మారి సోకే ప్రమాదం ఉన్న జీవజాతుల్లో 40 శాతం జాతులు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయని తేల్చారు.

అన్నీ చూడండి

Toxic Torture reson: టాక్సిక్ చిత్రం టార్చెర్ కు కారణం ఏమిటి ? రుక్మిణి వసంత్ పాత్రపై చర్చ

Varanasi rumors: వారణాసి ని మరిచిపోకుండా వదంతులతో ప్రచారం చేస్తున్నారా ?

Rakul Preet Singh: అందం, అహంకారం ఉన్న స్త్రీగా నటించడం గర్వంగా వుంది

Allari Naresh: రంభ ఊర్వశి మేనక స్టెప్ లేస్తే తెల్లారి వేడుక... సాంగ్ రిలీజ్

Nani: ఫోక్ మాస్ ఆంథమ్‌గా ది ప్యారడైజ్ సెకండ్ సింగిల్ డల్లాస్‌లో లాంచ్

తర్వాతి కథనం
Show comments