మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2020 (19:29 IST)

కరోనావైరస్ వేళ విటమిన్ డి ఎందుకు? (Video)

ఇప్పుడు విటమిన్ డి మాత్రలు గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. కరోనావైరస్ చికిత్సలో విటమిన్ డి టాబ్లెట్స్ కూడా వాడుతున్నారు. అసలు విటమిన్ డి ఎందుకు వాడాలో తెలుసకుందాం.
 
విటమిన్ డి స్థాయిలను పెంచడం వల్ల మానసిక స్థితి దృఢంగా మారుతుందా అనే దానిపై పరిశోధన కొనసాగుతోంది. విటమిన్ డి వల్ల వైరస్ రాకుండా అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. విటమిన్ డి చుక్కలు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు సాయం చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ సమర్థవంతంగా లేకపోతే మీ శరీరం సూక్ష్మక్రిములతో పోరాడలేదు.
 
ఆరోగ్యకరమైన విటమిన్ డి స్థాయిలు ఎముకల బలహీనతను తగ్గిస్తాయి. ఇది బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి సహాయపడుతుంది. ఆస్టియోమలాసియా చికిత్సకు వైద్యులు విటమిన్ డి ఉపయోగిస్తారు. ప్రతి 10 మందిలో నలుగురికి విటమిన్ డి లేమితో బాధపడుతున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. కనుక ఎక్కువ సూర్యకాంతితో ఆ సమస్యను తీర్చుకోవచ్చు.
 
చేపల్లో విటమిన్ డి వుంటుంది. వాటితో పాటు ఆరెంజ్ జ్యూస్, పెరుగు, పాల ఉత్పత్తులు మంచి ఎంపికలు. గుడ్డు సొనలోను ఈ విటమిన్ లభిస్తుంది. బలవర్థకమైన తృణధాన్యాలలో లభ్యమవుతుంది. చాలామంది ఎండ తగలకుండా గొడుగులు వేసుకుంటుంటారు. అస్సలు సూర్య కిరణాలను శరీరానికి తగలనీయరు. సూర్యకిరణాల నుండి మీ చర్మాన్ని రక్షించడం ముఖ్యమే. కానీ మీ శరీరానికి విటమిన్ డి కావాలంటే సూర్యుడు అవసరం, రోజుకు 15 నుంచి 20 నిమిషాల పాటు ఎండలో వుండాలి. తద్వారా విటమిన్ డి మీ శరీరానికి అందుతుంది.