ఇండియన్ ఫ్లైట్స్‌పై నిషేధం పొడగించిన కెనడా ప్రభుత్వం
కరోనా వైరస్ మమహమ్మారి కారణంగా పలు దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధించాయి. మరికొన్ని దేశాలు ఆంక్షల నేపథ్యంలో విమాన రాకపోకలకు అనుమతి ఇస్తున్నాయి. ఈ క్రమలో కెనడా ప్రభుత్వం మరోమారు భారతీయ విమానాలపై ఆంక్షలను పొడిగించింది. ఆగస్టు 21వ తేదీ వరకు భారతదేశం నుంచి వస్తున్న విమానాలపై సస్పెన్షన్ విధించినట్లు కెనడా ప్రభుత్వం తాజాగా పేర్కొంది.
ఇటీవల డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న కారణంగా విమాన ప్రయాణాలపై మళ్లీ ఆంక్షలను పొడిగించారు. ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన ఇండియా, పాక్ నుంచి వెళ్లే విమానాలపై కెనడా బ్యాన్ విధించింది. ప్యాసింజర్, బిజినెస్ విమానాలను రద్దు చేశారు.
అయితే ఆగస్టు నుంచి కరోనా టీకాలు రెండు డోసులు వేసుకున్న వారికి అనుమతి కల్పించనున్నట్లు కెనడా తెలిపింది. ఈ సారి కెనడా ప్రభుత్వం సుమారు నాలుగు లక్షల మందికి ఇమ్మిగ్రేషన్ వీసాలను జారీచేయనుంది. కోవిడ్‌తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.