గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 31 మార్చి 2018 (14:56 IST)

జీపులోకి దూకిన చిరుత.. ఆ వ్యక్తి ఏం చేశాడంటే?

ఓ వ్యక్తి జీప్‌లో వెళ్తుండగా ఉన్నట్టుండి.. ఓ చిరుత పరుగులు తీస్తూ జీపులోకి దూకింది. అంతే ఆ వ్యక్తికి చుక్కలు కనిపించాయి. ఊపిరిని బిగపట్టుకుని జీపులో కూర్చున్నాడు. ఇక ప్రాణం పోతుందనుకున్నాడు. కానీ ఆ చి

ఓ వ్యక్తి జీప్‌లో వెళ్తుండగా ఉన్నట్టుండి.. ఓ చిరుత పరుగులు తీస్తూ జీపులోకి దూకింది. అంతే ఆ వ్యక్తికి చుక్కలు కనిపించాయి. ఊపిరిని బిగపట్టుకుని జీపులో కూర్చున్నాడు. ఇక ప్రాణం పోతుందనుకున్నాడు. కానీ ఆ చిరుత ఏం చేసిందంటే.. చదవండి మరి. సాధారణంగా.. ఉన్నట్టుండి చిరుత ఎదురైతే.. ఎవరికైనా గుండాగిపోతుంది.
 
అలాగే మీరు వెళ్తున్న వాహనంలోకి చిరుత ఎగిరిపడితే ఎలా వుంటుంది. అలాంటి ఘటనే టాంజానియాలోని సెరంగటి నేషనల్ పార్కులో జరిగింది. బ్రిటన్ హేస్‌ అనే వ్యక్తి సఫారీ జీపులో వెళ్తుండగా వాహనం వెనుక నుంచి సీటులోకి చిరుత దూకింది. 
 
చిరుత వాహనంలోకి రావడంతో... బ్రిటన్‌ హేస్‌ కదలకుండా గతంలో గైడ్ చెప్పిన సూచనల ప్రకారం ఊపిరి బిగపట్టి అలాగే కూర్చుండిపోయాడు. దీంతో చిరుత వచ్చిన దారిలోనే వెళ్లిపోయింది. చిరుత జీపు నుంచి వెళ్లిపోవడంతో హేస్ హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నాడు.