గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 23 జులై 2020 (14:08 IST)

అంగారకుడిపైకి చైనా రాకెట్‌

అంగారక గ్రహంపైకి చైనా తన అతిపెద్ద రాకెట్‌ అయిన లాంగ్‌ మార్చ్‌5ను గురువారం ప్రయోగించింది. ఈ రాకెట్‌లో అంగారకుడి చుట్టూ తిరిగే అర్బిటర్‌, రోవర్‌, ల్యాండర్‌ ఉన్నాయి.

ఈ మిషన్‌కు తియాన్‌వెన్‌-1 అనే పేరును పెట్టింది.తియాన్‌వెన్‌-1 దాదాపు 55 ఏడు నెలల పాటు మిలియన్‌ కిలోమీటర్లు ప్రయాణించి ఫ్రిబవరి 2021న అంగారకుడి వద్దకు చేరుకుంటుంది.

ఈ సమయంలో భూమికి, అంగారకుడికి మధ్య దూరం తగ్గిపోతుండడంతో దాన్ని ప్రయోజనకరంగా మార్చుకునేందుకు ఈ సమయంలో రాకెట్‌ను ప్రయోగించింది.

ఇదే ఉద్దేశ్యంతో అమెరికా కూడా అంగారకుడిపై అధ్యయానికి జులై 30వ తేదీన రాకెట్‌ను ప్రయోగించింది. యునైటెడ్‌ అరబ్‌ ఏమిరేట్స్‌ కూడా గత వారంలో అంగారకుడి అధ్యయానికి రాకెట్‌ను ప్రయోగించింది.

అమెరికా 1990 నుంచి నాలుగు రోవర్లను అంగారకుడిపైకి పంపించింది. చైనా కూడా 2011లో ఒకసారి రష్యా సహకారంతో రోవర్‌ను ప్రయోగించింది. కానీ అది విఫలమయింది.