భారత్‌తో మళ్లీ కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా

India-China
India-China
సెల్వి| Last Updated: గురువారం, 23 జులై 2020 (12:36 IST)
భారత్‌తో మళ్లీ చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది. లడఖ్‌లోని ప్రాంతం నుంచి బలగాలను వెనక్కి వెళ్లిన బలగాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని మెక్ మోహన్ రేఖ వైపు మళ్లీ వచ్చాయి. దాదాపు 40 వేల మంది సైనికులు అక్కడ మోహరించి చైనా రెచ్చగొడుతోంది. దీంతో భారత సైన్యం కూడా అప్రమత్తమైంది.

సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణపై చైనా మరోసారి మాట తప్పడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. దీంతో వైమానిక దళాలను అప్రమత్తం చేసి యుద్ధ సామగ్రిని తరలిస్తోంది. అలాగే సరిహద్దుల వెంట నిత్యం చైనా కదలికలను పరిశీలించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు కూడా వెళ్లాయి.

మరోవైపు ఇటీవల జరిగిన ఒప్పందంలో భాగంగా ఫింగర్‌-5 ప్రాంతం నుంచి కూడా చైనా సైన్యం వెళ్లేందుకు ససేమిరా అనడంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనికి తోడు హాట్‌స్ప్రింగ్‌, గోగ్రాపోస్ట్‌ ప్రాంతాల్లో చైనా చేపట్టిన భారీ నిర్మాణాలను కొనసాగిసూనే ఉంది. దీనికి ధీటుగా భారత్‌ కూడా నిర్మాణాలు కొనసాగిస్తోంది.దీనిపై మరింత చదవండి :