శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 22 జూన్ 2017 (14:12 IST)

వామ్మో... నూడుల్స్‌లో పాము పిల్ల...

సాధారణంగా నూడుల్స్‌లో వివిధ రకాల పురుగులు, జెర్రులు, బల్లులు ఉన్నట్టు గతంలో పలుచోట్ల వార్తలు వచ్చాయి. కానీ, ఇపుడు ఏకంగా పాము పిల్లే కనిపించింది. అదీ కూడా హాట్‌హాట్‌గా ఉండే నూడుల్స్‌లో. ఈ షాకింగ్ సంఘటన

సాధారణంగా నూడుల్స్‌లో వివిధ రకాల పురుగులు, జెర్రులు, బల్లులు ఉన్నట్టు గతంలో పలుచోట్ల వార్తలు వచ్చాయి. కానీ, ఇపుడు ఏకంగా పాము పిల్లే కనిపించింది. అదీ కూడా హాట్‌హాట్‌గా ఉండే నూడుల్స్‌లో. ఈ షాకింగ్ సంఘటన చైనాలోని గాంగ్జీ విశ్వవిద్యాలయంలో క్యాంటీన్‌లో కనిపించింది. 
 
ఈ యూనివ‌ర్సిటీలో చ‌దివే ఓ విద్యార్థిని నూడుల్స్ ఆరగించేందుకు ఆర్డ‌ర్ ఇచ్చింది. నూడుల్స్‌ను తీసుకొచ్చాడు వెయిట‌ర్. బాగా ఆకలి దంచేస్తుండటంతో రెండు మూడు స్పూన్స్ ఆరగించింది కూడా. త‌ర్వాత స్పూన్‌తో నూడుల్స్‌ను అటూ ఇటూ అంటుంటే ట‌క్కున ఓ పాము పిల్ల ప్ర‌త్య‌క్ష‌మైంది నూడుల్స్‌లో. 
 
దెబ్బ‌కు బేర్‌మ‌న్న ఆ అమ్మాయి విష‌యాన్ని క్యాంటీన్ దృష్టికి తీసుకెళ్లినా ప‌ట్టించుకోలేద‌ట‌. వెంట‌నే నూడుల్స్‌లో ఉన్న పాము పిల్ల ఫోటోలు తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇక‌.. ఆ ఫోటో చైనాలో వైరల్ అయిపోయింది. దీనిపై స్పందించిన ఆహారపు శాఖ అధికారులు వర్శిటీ క్యాంటీన్‌‍పై రైడ్ చేశారు.