పాకిస్థాన్‌లో అంతర్యుధ్ధం తప్పదా?

Imran Khan
Imran Khan
సెల్వి| Last Updated: గురువారం, 22 అక్టోబరు 2020 (14:04 IST)
పాకిస్థాన్‌లో అంతర్యుధ్ధం వంటి తీవ్ర పరిస్థితి తలెత్తింది. సింధ్ ప్రావిన్స్ పోలీసులు బాహాటంగా సైన్యంపై తిరగబడ్డారు. ఉభయ పక్షాల మధ్య దాడులు, ప్రతిదాడులు జరిగాయి. తొలుత సింధ్‌లో ముస్తాక్ అహ్మద్ మహర్ అనే ఐజీపీని కిడ్నాప్ చేశారని పారామిలిటరీ దళాలపై ఆరోపణలు తలెత్తాయి.

తమను 'రేంజర్లు'గా చెప్పుకుంటున్న వీరు ముస్తాక్‌ని కిడ్నాప్ చేశారని, ప్రతిపక్షనేత బిల్వాల్ భుట్టో జర్దారీకి అధికార ప్రతినిధి అయిన సఫ్దర్ అవాన్‌ను అరెస్టు చేయాలని ఆదేశించాలంటూ బలవంతంగా ఆయన చేత సంతకం చేయించుకున్నారని వార్తలు వచ్చాయి.

నాలుగు గంటలపాటు వారు ఆయనను బందీగా ఉంచుకున్నారట. సఫ్దర్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అల్లుడు. ఓ కేసులో సప్దర్ ఇటీవలే సింధ్ కోర్టు నుంచి బెయిల్ పొందారు. కాగా-పోలీసు అధికారి కిడ్నాప్ వ్యవహారంపై ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం స్పందించనప్పటికీ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బాజ్వా దర్యాప్తునకు ఆదేశించారు. రెండేళ్ల క్రితం ఇమ్రాన్ అధికారంలోకి వఛ్చినప్పటి నుంచి ఇంత పెద్ద ఘటన జరగడం ఇదే మొదటిసారి.

తమ దేశ సైన్యం అత్యాచారాలకు పాల్పడుతోందని సింధ్ ప్రావిన్స్ పోలీసులు ఆరోపిస్తున్నారు. పాకిస్థాన్ డెమొక్రటిక్ మూవీ మెంట్ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేసిన వీరు.. ఇమ్రాన్ ప్రభుత్వం మిలటరీ చేతిలో కీలుబొమ్మ సర్కార్‌గా మారిందని దుయ్యబడుతున్నారు.దీనిపై మరింత చదవండి :