కోవిడ్ 19 వ్యాక్సిన్ బూస్టర్ పంపిణీ ఒక కుంభకోణం: డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్
కోవిడ్ 19 వ్యాక్సిన్ బూస్టర్ పంపిణీని ఒక కుంభకోణంగా వర్ణించారు డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ గెబ్రేయేస్దీ. దీన్ని తక్షణమే ఆపివేయా లన్నారు.
ప్రతిరోజు, తక్కు వ-ఆదాయ దేశాలలో ప్రాథమిక మోతాదుల కంటే ప్రపంచ వ్యాప్తంగా ఆరు రెట్లు ఎక్కువ బూస్టర్ డోస్‌లు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన పెద్దలకు బూస్టర్లు ఇవ్వడంలో అర్ధమే లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులు మరియు ఇతర హై-రిస్క్ గ్రూపులు ఇప్పటికీ వారి మొదటి డోస్ కోసం ఎదురు చూస్తు న్నప్పుడు, ఆరోగ్యవంతమైన పెద్దలకు బూస్టర్‌లు ఇవ్వడం, పిల్లలకు టీకాలు వేయడం అర్ధమేంటని అభివృద్ధి చెందిన దేశాలను ఆయన ప్రశ్నించారు.
అక్టోబరులో గ్లోబల్ హెల్త్ బాడీ గతంలో సూచించిన ట్లుగా, రోగనిరోధక శక్తి లేని వ్యక్తులు మాత్రమే బూస్టర్ డోస్‌లు తీసుకో వాలని ఆయన తెలిపారు.
ఇప్పటికైనా బూస్టర్ డోస్‌లను ఆపి వేసి పేద దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు కోవిడ్ వ్యాక్సిన్ లను అందించాలని ట్రెడోస్ పేర్కొన్నారు.