అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు.. ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్..
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోన్న వేళ డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ కంటే ప్రచారంలో తానే ముందున్నానని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ట్రంప్ ప్రచార హోరుకు కాస్త బ్రేక్‌పడింది. ట్రంప్ సలహాదారు హోప్ హిక్స్ కరోనా బారిన పడ్డారు.
విధినిర్వహణలో భాగంగా ఆమె నిత్యం ట్రంప్ వెంటే ఉంటుంది. దీంతో అధ్యక్షుడు ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. తాము కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నామని, ఫలితాల కోసం వేచిచూస్తున్నామని ట్రంప్ ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే తాను ఎన్నిరోజులపాటు ఐసోలేషన్‌లో ఉంటాననే విషయాన్ని తెలపలేదు.
హోప్ హిక్స్‌కు కరోనా లక్షణాలు కనిపిండచంతో పరీక్షలు చేయించామని, అందులో పాజిటివ్ వచ్చిందని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి ఎయిర్‌ఫోర్స్ వన్‌లో హిక్స్ క్రమం తప్పకుండా ప్రయాణిస్తూ ఉంటారు. ఆమె ఈవారం ప్రారంభంలో అధ్యక్ష చర్చల కోసం ఇతర సీనియర్ అధికారులతో కలిసి క్లీవ్‌లాండ్ వెళ్లారు.
అయితే కరోనా పరీక్షల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ట్రంప్ సలహాదారుల్లో ఒకరికి కరోనా సోకడంతో వీరు పరీక్షలు చేయించుకున్నారు. తాము క్వారంటైన్‌లోకి వెళ్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
తన సలహాదారు హోప్ హిక్స్ విరామం లేకండా విధుల్లో నిరంతరం నిమగ్నమై ఉండటంతో ఆయనకు కొవిడ్-19 వచ్చిందని.. ఇది చాలా విచారకరమని అమెరికా అధ్యక్షుడు సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. తనతో పాటు ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కూడా కరోనా పరీక్ష చేయించుకున్నామని.. ఫలితాల్లో పాజిటివ్ అని తేలినట్లు వెల్లడించారు.