ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (18:18 IST)

దక్షిణాఫ్రికాలో పెను విధ్వంసం సృష్టిస్తున్న భారీ వర్షాలు

durban floods
దక్షిణాఫ్రికాలో భారీ వర్షాలు పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఈ దేశంలో సంభవించిన భారీ వరదల వల్ల ఇప్పటివరకు సుమారుగా 400 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. అలాగే, వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 
 
అగ్నేయ తీర నగరమైన డర్బన్‌లోని కొన్ని ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో రోడ్లతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. అనేక ఇళ్లు కూలిపోయాయి. అనేకమంది వరదనీటిలో కొట్టుకునిపోయారు. 
 
ఈ వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 398కు చేరగా, 27 మంది గల్లంతైనట్టు సౌతాఫ్రికా వర్గాల సమాచారం. వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. డర్బన్ జిల్లాలో తప్పిపోయిన ఒక కుటుంబానికి చెందిన 10 మంది ఆచూకీ తెలియంలేదు. 
 
ఇదే అంశంపై డర్బన్ ఎమర్జెన్సీ సర్వీస్ ప్రతినిధి మాట్లాడుతూ, దేశంలోనే అత్యంత ఘోరమైన విపత్తు ఇదేనని చెప్పారు. ఇప్పటివరకు 400 మందికిపైగా మరణించారని ఆయన తెలిపారు.