గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (14:37 IST)

భూమిని అంతరిక్షం నుంచి చూస్తే ఎలా వుంటుందంటే? (video)

Space
Space
భూమిని అంతరిక్షం నుంచి చూస్తే ఎలా వుంటుందోనని చెప్పే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. భూమి అన్ని గ్రహాల కంటే అద్భుతమైనది. తాజా వీడియోలో రాత్రిపూట భూమి విద్యుత్ దీపాలతో వెలిగిపోతూ కనిపించింది. 
 
రాత్రివేళ భూమి ఎలా వుంటుందోననే దృశ్యాలకు సంబంధించిన వీడియోను వండర్ ఆఫ్ సైన్స్ విడుదల చేసింది. రాత్రివేళ భూమిలో రంగులేవీ కనిపించకపోయినా.. సముద్ర తీరాల పక్కన ఆయా నగరాల విద్యుత్ కాంతుల వల్ల భూమి బంగారు వర్ణంలో మెరుస్తున్నట్లు కనిపిస్తోంది.