కొలంబోలో భారీ భూకంపం: రిక్టరు స్కేలుపై 6.2గా నమోదు
శ్రీలంక రాజధాని కొలంబోలో భారీ భూకంపం ఏర్పడింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 6.2గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
శ్రీలంక రాజధాని కొలంబోకి ఆగ్నేయ దిశగా 1326 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. తాజాగా సంభవించిన భూకంపం వల్ల లంక దేశానికి అంతగా నష్టం జరగలేదని తెలుస్తోంది.
శ్రీలంకలో భారీ భూకంపం సంభవించగా.. భారత్ లోనూ లడాఖ్‌లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది.