గురువారం, 4 జులై 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2023 (23:37 IST)

శ్రీలంకను సస్పెండ్ చేసిన ఐసీసీ

sri lanka
మాజీ వన్డే, టీ20 ప్రపంచ ఛాంపియన్ శ్రీలంకను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సస్పెండ్ చేసింది. శ్రీలంక క్రికెట్ బోర్డులో ప్రభుత్వ జోక్యమే ఈ సస్పెన్షన్‌కు కారణమని తెలుస్తోంది.
 
జట్టు నిర్వహణ కోసం మాజీ ప్రపంచ కప్ విజేత కెప్టెన్ అర్జున రణతుంగ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల తాత్కాలిక బృందాన్ని కూడా ప్రభుత్వం నియమించింది. ఈ విషయాన్ని ఆ దేశ క్రీడా విభాగం అధికారికంగా ప్రకటించింది.
 
ఈ నేపథ్యంలో శ్రీలంక జట్టును ఐసీసీ సస్పెండ్ చేసింది. "ఐసీసీలో పూర్తికాల సభ్యుడైన శ్రీలంక క్రికెట్ బోర్డు నిబంధనలను ధిక్కరించి పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే గ్రాచికా బోర్డును సస్పెండ్ చేశాం. ఈ రోజు జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. శ్రీలంక క్రికెట్ బోర్డు వ్యవహారాలు స్వయం ప్రతిపత్తితో నిర్వహించాలి. అలాగే, ప్రభుత్వ జోక్యం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది" అని ఐసీసీ పేర్కొంది.