1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (18:14 IST)

ఈఫిల్ టవర్ చూసేందుకు వెళ్తున్నారా..? పిక్ పాకెటింగ్ జాగ్రత్త!

ఈఫిల్ టవర్ చూసేందుకు వెళ్తున్నారా? అయితే జాగ్రత్త అంటున్నారు పోలీసులు. ప్రాన్స్ రాజధాని పారిస్‌సో కొలువై ఉన్న ఈఫిల్ టవర్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కట్టడాల్లో ఒకటి. ఏడాది పొడవునా ఈ భారీ నిర్మాణం సందర్శకులకు తెరిచే ఉంటుంది. ఏదన్నా బాంబు బెదిరింపో, నిరసనల సందర్భంగానో తప్ప ఇది మూతపడడం అరుదు. కానీ, శుక్రవారం నాడు మాత్రం ఇది మూతపడింది. 
 
ఎందుకో తెలుసా?... ఈఫిల్ టవర్ వద్ద పిక్ పాకెటింగ్ ఎక్కువైపోయిందంటూ సిబ్బంది నిరసన చేపట్టారు. జేబు దొంగలు స్వైర విహారం చేస్తున్నారని వారు ఆందోళన వెలిబుచ్చారు. టవర్ నిర్వహణ సంస్థ దీనిపై మాట్లాడుతూ, సమస్యపై పోలీసు విభాగంతో చర్చిస్తున్నామని, త్వరలోనే ఈ చారిత్రక కట్టడం తెరుచుకుంటుందని తెలిపింది. కాగా, క్రైమ్ రేటు తగ్గుముఖం పట్టిందని, పోలీసు గస్తీ, వీడియో నిఘా ఫలితాలనిచ్చాయని పారిస్ అధికారవర్గాలు ప్రకటించాయి.