సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 15 జనవరి 2020 (09:16 IST)

శ్రీలంకలో ఐదుగురు భారతీయులు అరెస్ట్‌

వీసా గడువు ముగిసినా తమ దేశంలో ఉన్నారన్న ఆరోపణలపై ఏడుగురు భారతీయులను శ్రీలంక ఎమ్మిగ్రేషన్‌ అధికారులు అరెస్టు చేశారు.

వట్టాలాలో ప్రముఖ నిర్మాణ స్థలంలో కార్మికులుగా పనిచేస్తున్న ఏడుగురు భారతీయులు వీసా గడువు ముగిసినా… అక్రమంగా నివసిస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్‌, ఎమ్మిగ్రేషన్‌ శాఖ దర్యాప్తు సంస్థ గుర్తించింది. నెల రోజుల బిజినెస్‌ ట్రిప్‌ కోసం శ్రీలంకకు చేరుకుని… గడువు దాటినా ఇక్కడే ఉండటంతో పాస్‌పోర్ట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసేవరకూ వారిని నిర్బంధ కేంద్రాలకు తరలించినట్లు తెలుస్తోంది. వీరంతా దక్షిణాది రాష్ట్రానికి చెందిన వారుగా సమాచారం.